Sunday, 19 February 2017

ఫిబ్రవరి 2017 అవార్డ్స్

2016 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులను Academy of Motion Picture Arts and Sciences ఫిబ్రవరి 26న ప్రకటించింది. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా బేరీ జెన్కిన్స్ దర్శకత్వం వహించిన "మూన్‌లైట్" ఎంపికైంది. "మాంచెస్టర్ బై ద సీ"చిత్రంలో నటనకు గాను కేసీ అప్లెక్‌ను ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. లా లా ల్యాండ్ చిత్రంలో నటనకు ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది. 

అత్యధికంగా 14 నామినేషన్లు పంపిన లా లా ల్యాండ్ చిత్రానికి 6 అవార్డులు దక్కగా మూన్‌లైట్ చిత్రానికి 3, మాంచెస్టర్ బై ద సీ చిత్రాలకు రెండేసి అవార్డులు వచ్చాయి. 
అవార్డుల జాబితాఉత్తమ చిత్రం:మూన్‌లైట్ 
ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్ (మాంచెస్టర్ బై ద సీ)
ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్)
ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా ల్యాండ్)
ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ (మూన్‌లైట్)
ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్ (ఫెన్సెస్)
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: జూటోపియా
యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్: పైపర్
సినిమాటోగ్రఫి: లినస్ సాండ్‌గ్రెన్ (లా లా ల్యాండ్)
కాస్ట్యూమ్ డిజైన్: కొలీన్ ఎట్‌వుడ్ (ఫెంటాస్టిక్ బీస్ట్స్)
ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే-మేడ్ ఇన్ అమెరికా
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ఫిల్మ్): ద వైట్ హెల్మెట్స్
ఉత్తమ ఎడిటింగ్: హాక్సారిడ్‌‌జ (జాన్ గిల్బర్ట్)
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సేల్స్‌మ్యాన్ (ఇరాన్-అస్గర్ ఫర్హాదీ)
మేకప్ అండ్ హెయిర్ స్టైల్: అలెస్సాండ్రో బర్టోలాజీ, జార్జియో గ్రిగోరినీ, క్రిస్టోఫర్ నిల్సన్ (సూసైడ్ స్క్వాడ్)
ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్) : లా లా ల్యాండ్ (జస్టిన్ హర్‌విట్జ్)
ఉత్తమ గేయం (ఒరిజినల్ సాంగ్): సిటీ ఆఫ్ స్టార్స్ ( లా లా ల్యాండ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: లా లా ల్యాండ్
సౌండ్ ఎడిటింగ్: సిల్వియిన్ బెల్లేమేర్ (అరైవల్)
సౌండ్ మిక్సింగ్: హాక్సారిడ్‌‌జ
విజువల్ ఎఫెక్ట్స్ : ద జంగల్ బుక్
లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్: సింగ్
ఒరిజినల్ స్కీన్‌ప్ల్రే: మాంచెస్టర్ బై ద సీ
అడాప్టెడ్ స్కీన్‌ప్ల్రే: మూన్‌లైట్
ఉత్తమ రచయిత (అడాప్టెడ్): మూన్‌లైట్
ఉత్తమ రచయిత (ఒరిజినల్): మాంచెస్టర్ బై ద సీ
టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంప్రముఖ పాత్రికేయుడు టంకశాల అశోక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆంగ్లంలో రాజ్‌మోహన్‌గాంధీ రచించిన పటేల్: ఏ లైఫ్ (బయోగ్రఫీ) పుస్తకాన్ని టంకశాల అశోక్.. వల్లభాయ్‌పటేల్ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీన్ని 2016లో తెలుగులో ఉత్తమ అనువాద పుస్తకంగా అకాడమీ ప్రకటించింది.
సంస్కృత అనువాదంలో రాణి సదాశివమూర్తికి పురస్కారంరాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగులో రాళ్లబండి కవితాప్రసాద్ రచించిన ‘ఒంటరి పూలబుట్ట (కవితలు)’ ను సదాశివమూర్తి ‘వివక్త పుష్పకరంద’ పేరుతో సంస్కృతంలోకి అనువదించారు. దీన్ని 2016లో సంస్కృతంలో ఉత్తమ అనువాద పుస్తకంగా అకాడమీ ప్రకటించింది.
ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులకు IESA హాక్‌థాన్ అవార్డు ఫిబ్రవరి 21, 22న బెంగళూరులో జరిగిన ఐఈఎస్‌ఏ విజన్ సమ్మిట్- 2017లో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐవోటీ-ఏర్/ వీఆర్ మేక్- ఏ- థాన్ అవార్డు గెలుపొందారు. విశ్వవిద్యాలయంలోని నెక్ట్స్ టెక్ ల్యాబ్‌కు చెందిన విద్యార్థులకు రూపొందించిన స్మార్ట్ ఇండస్ట్రీయల్ డిటెక్షన్ సిస్టమ్‌కు ఈ అవార్డు దక్కింది. పరిశ్రమలలోని యంత్రాల్లో తలెత్తే లోపాలను ఈ సిస్టమ్ ముందుగా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. 
వెంకటనారాయణకు ఎన్‌ఆర్ చందూర్ పురస్కారంప్రతిష్టాత్మక ఎన్‌ఆర్ చందూర్-జగతి పురస్కారం-2017కు ప్రముఖ పాత్రికేయుడు ఎస్. వెంకటనారాయణ ఎంపికయ్యారు. పాత్రికేయంలో విశిష్ట సేవలందిస్తున్న తెలుగు వారికి చందూర్ కుటుంబ సభ్యులు, శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ సంయుక్తంగా ఏటా ఈ అవార్డు అందజేస్తున్నారు. వెంకటనారాయణ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లోని వివిధ టీవీ, రేడియోలకు సౌత్ ఏసియా బ్యూరో చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.
జయప్రకాశ్‌రెడ్డికి రేలంగి పురస్కారంరేలంగి వెంకటరామయ్య పురస్కారం-2017కు సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతిక శాఖ, చలనచిత్ర, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. 
రాజిందర్, పద్మాకర్‌లకు సీకే నాయుడు పురస్కారం భారత దేశవాళీ క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న మాజీ స్పిన్నర్లు రాజిందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్‌లు సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం-2017కు ఎంపికయ్యారు. వీరితో పాటు అవార్డుకు ఎంపికైన మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి సీకే నాయుడు అవార్డు అందుకున్న తొలి మహిళా క్రికెట్‌గా గుర్తింపు పొందనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 27న బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. మార్చి 8న బెంగళూరులో జరగనున్న బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో వీరికి పురస్కారాలు అందజేయనున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌కు సీఎన్‌బీసీ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్CNBC TV 18 సంస్థ ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల్లో భాగంగా ఇచ్చే స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు(2016-17) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాలకు చెందిన జాతీయస్థాయి ప్రముఖులతో కూడిన జ్యూరీ ఏపీని ఈ అవార్డుకు ఎంపిక చేసిందని ఫిబ్రవరి 28న ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు దేశంలోని వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఏపీకి మొదటి స్థానం ఇచ్చిందని పేర్కొంది. 

వివిధ రంగాల్లో ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థలు సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకొని సీఎన్‌బీసీ టీవీ 18 సంస్థ ఏటా ఈ పురస్కారాలను అందిస్తోంది.


ఏపీ నంది నాటక పురస్కారాలు-2016

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది నాటక పురస్కారం-2016 విజేతల వివరాలను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫిబ్రవరి 21న ప్రకటించింది. ఈ మేరకు జనవరి 13 నుంచి 15 వరకు గుంటూరు, కర్నూలు. విజయనగరంలో నిర్వహించిన 20వ నంది నాటకోత్సవాల్లో విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు రూ.1.50 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించనున్నారు. 
విభాగాలవారీగా విజేతల వివరాలు 
పద్యనాటక విభాగంప్రథమ బహుమతి- సతీసావిత్రి- లలితకళా పరిషత్ (అనంతపురం)
ద్వితీయ బహుమతి-ప్రమీలార్జున పరిణయం-లలిత కళాసమితి (కర్నూలు)
తృతీయ బహుమతి- చాణక్య-చంద్రగుప్త- ఖమ్మం కల్చరల్ అసోసియేషన్ 
సాంఘిక నాటక విభాగంప్రథమ బహుమతి-అక్షర కిరీటం-గంగోత్రి కళాకారులు (పెదకాకాని)
ద్వితీయ బహుమతి- జారుడు మెట్టులు- కళాంజలి (హైదరాబాద్)
తృతీయ బహుమతి-ఇంటింటి కథలు- విద్యాదిత్య ఆర్‌‌ట్స (రాజమండ్రి)
సాంఘిక నాటిక విభాగంప్రథమ బహుమతి- చాలు-ఇక చాలు- శ్రీసాయి ఆర్‌‌ట్స (కొలకలూరు)
ద్వితీయ బహుమతి-రెండు నిశ్శబ్దాల మధ్య- అభినయ ఆర్‌‌ట్స (గుంటూరు)
తృతీయ బహుమతి- తేనెటీగలు పగబట్టాయి-శర్వాణి గిరిజన సేవా సంఘం (బోరివంక)
బాలల నాటిక విభాగంప్రథమ బహుమతి-ఎక్కడివాళ్లు అక్కడే- శ్రీప్రకాష్ విద్యానికేతన్ (విశాఖ)
ద్వితీయ బహుమతి-అపురూపం-కళారాఘవ, శ్రీగురురాజ కాన్సెప్ట్ స్కూలు (నంద్యాల)
తృతీయ బహుమతి-భరోసా- కళాప్రియ లిటిల్ ఛాంప్స్ (ఒంగోలు)
కళాశాల, విశ్వవిద్యాలయ నాటికల విభాగంప్రథమ బహుమతి-సంభవామి-సెయింట్ థెరిస్సా డిగ్రీ కాలేజి ఫర్ ఉమన్ (ఏలూరు)
ద్వితీయ బహుమతి- కాంట్రవర్సీ- పీబీ సిద్ధార్థ ఆర్‌‌ట్స అండ్ సైన్‌‌స (విజయవాడ)
తృతీయ బహుమతి-వృక్షో రక్షతి రక్షితః- ఎస్‌ఎస్‌డీఎస్ డిగ్రీ కాలేజి (అనంతపురం)
ఎన్జీరంగా వర్సిటీ రిజిస్ట్రార్‌కు జాతీయ అవార్డుఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణకు నేషనల్ ఫెలోషిప్ అవార్డు దక్కింది. హరియాణాలో జరుగుతున్న భారత వ్యవసాయ ఇంజినీర్ల సదస్సులో ఫిబ్రవరి 16న ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గత 20 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల శాస్త్రవేత్తలు ఈ పురస్కారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి.

కరణ్ థాపర్‌కు జీకే రెడ్డి పురస్కారం 
ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ జీకే రెడ్డి జాతీయ స్మారక పురస్కారం-2016కు ఎంపికయ్యారు. టి. సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ పురస్కారాల కమిటీ పాత్రికేయ రంగానికి సంబంధించి ఆయనకు ఈ అవార్డు ప్రకటించింది. పురస్కారం కింద రూ. 5 లక్షల బహుమతి, బంగారు పతకం అందిస్తారు. ప్రస్తుతం ఆయన ఇండియా టుడేలో పనిచేస్తున్నారు. 
ఇస్కాన్‌కు ఐఎంసీ పురస్కారం ఐఎంసీ రామకృష్ణ బజాజ్ నేషనల్ క్వాలిటీ అవార్డు-2016కు ఇస్కాన్ సంస్థ ఎంపికైంది. ఈ మేరకు ఫిబ్రవరి 11న జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అవార్డు అందుకున్నారు. అన్నమిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అన్ని పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందిస్తున్నందుగాను సంస్థకు ఈ పురస్కారం దక్కింది. ఐఎస్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఏడు రాష్ట్రాల్లో 29 సెంట్రలైజ్డ్ కిచెన్‌లను ఏర్పాటు చేసిన ఇస్కాన్ సంస్థ వీటి ద్వారా 6,500 పాఠశాలల్లో 12 లక్షల మంది పేద, అనాథ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడుతోంది. 
వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ -2017 పురస్కారంCurrent Affairsఅసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ఫోటో గ్రాఫర్ బుర్హాన్ తీసిన చిత్రానికి ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్-2017 పురస్కారం దక్కింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న వివిధ విభాగాల్లో అవార్డుల పొందిన వారి జాబితాను జూరీ సభ్యులు వెల్లడించారు. 2016 డిసెంబర్ 19న టర్కీ రాజధాని అంకారాలో జరిగిన కార్యక్రమంలో ఓ పోలీసు అధికారి రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్‌ను తుపాకితో కాల్చి చంపాడు. అక్కడే ఉన్న బుర్హాన్ ఈ చిత్రాలు తీశాడు. అవార్డు కోసం 125 దేశాల నుంచి 80 వేలకు పైగా ఎంట్రీలు రాగా బుర్హాన్ తీసిన ఈ ఫోటో మొదటి బహుమతి గెలుచుకుంది. దీంతోపాటు స్పాట్ న్యూస్, స్టోరీస్ విభాగంలోనూ విజేతగా నిలిచింది. 


గ్రామీ పురస్కారాలు-2017 59వ గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవం ఫిబ్రవరి 13న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. 2017 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి అవార్డులు అందించారు. బ్రిటన్‌కు చెందిన పాప్ సింగర్ అడెలె.. హల్లో, 25 వంటి అల్బమ్‌లకు ఏకంగా ఐదు అవార్డులు సొంతం చేసుకుంది. భారత్‌కు చెందిన తబలా ప్లేయర్ సందీప్ దాస్ ‘యో యో మా’ బృందంతో కలసి రూపొందించిన ‘సింగ్ మి హోమ్’ ఆల్బమ్‌కు ప్రపంచ మ్యూజిక్ విభాగంలో అవార్డు దక్కింది. ఈ బృందానికి గ్రామీ అవార్డు రావడం ఇది మూడోసారి. 
ముఖ్యమైన అవార్డులు-గ్రహీతలు
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ 
- "25", అడెల్
రికార్డ్ ఆఫ్ ది ఇయర్ - హల్లో, అడెల్
సాంగ్ ఆఫ్ ది ఇయర్ - హల్లో, అడెల్
పాప్ సోలో పర్‌ఫార్మెన్స్ - హల్లో, అడెల్
బెస్ట్ రాప్ ఆల్బమ్ - కలరింగ్ బుక్, చాన్స్ ద రేపర్
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ - చాన్స్ ద రేపర్
రాక్ పర్‌ఫార్మెన్స్ - బ్లాక్‌స్టార్, డేవిడ్ బోవి
రాక్ ఆల్బమ్ - టెల్ మీ ఐ ఆమ్ ప్రెట్టీ, కేజ్ ద ఎలిఫెంట్ 
బెస్ట్ మ్యూజిక్ వీడియో - బియాన్స్, ఫార్మేషన్
బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ - ది బీటెల్స్, ఎయిట్ డేస్ ఎ వీక్ ద టూరింగ్ ఇయర్స్
ఐడీబీఐ బ్యాంక్‌కు MSME ఎక్సలెన్‌‌స అవార్డుప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌ను ‘ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్‌‌స అవార్డు 2017’ వరించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థల- లకు అధిక నిధులు కేటాయించినందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రేడ్ అండ్ సర్వీసెస్ ఐడీబీఐకి ఈ అవార్డు అందించింది. 
బీవీఆర్ మోహన్ రెడ్డికి జీవితకాల సాఫల్య పురస్కారంసైయంట్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు-2017కు ఎంపికయ్యారు. ఈ మేరకు బెంగళూరులో ఫిబ్రవరి 13న జరిగిన కార్యక్రమంలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరెక్టర్, రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్ సతీశ్ రెడ్డి మోహన్ రెడ్డికి అవార్డు ప్రదానం చేశారు.

పద్మశ్రీని తిరస్కరించిన ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్
ప్రముఖ సితార్, సుర్‌బహార్ విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (82) ఇటీవల తనకు కేటాయించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వం తన ప్రతిభను చాలా ఆలస్యంగా గుర్తించిందని.. అవార్డును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 2017 సంవత్సరానికి గాను ఇటీవల 89 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం ఇమత్ ్రఖాన్‌ను ఎన్‌ఆర్ ఐ విభాగంలో పద్మశ్రీకి ఎంపిక చేసింది.

అనిష్ కపూర్‌కు ఇజ్రాయెల్ జెనెసిస్ అవార్డు భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ శిల్పి, సిరియన్ శరణార్థుల హక్కుల కోసం పోరాడిన అనిష్ కపూర్‌కు ప్రతిష్టాత్మక జెనెసిస్ అవార్డు లభించింది. శరణార్థుల పట్ల ప్రభుత్వాల దుర్మార్గపు విధానాలపై పోరాడినందుకు గాను ఇజ్రాయెల్‌కు చెందిన జెనెసిస్ ప్రైజ్ ఫౌండేషన్ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు కింద ఒక మిలియన్ డాలర్లు (రూ. 6.71 కోట్లు) నగదు బహుకరిస్తారు.

జనవరి 2017 అవార్డ్స్

1. పద్మ పురస్కారాలు - 2017 ::
1)2017 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం 89 మందికి పద్మా పురస్కారాలు ప్రకటించింది. 
2) గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని పద్మా అవార్డులకు ఎంపికైన వారి జాబితాను జనవరి 25న విడుదల చేసింది. 
3) ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందికి పద్మశ్రీ లభించాయి. 
4) పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, ఐదుగురు విదేశీయులు-ఎన్నారైలు ఉన్నారు. ఆరుగురు మరణానంతరం అవార్డులకు ఎంపికయ్యారు.
5)  అవార్డుల కోసం దేశవ్యాప్తంగా 18 వేల నామినేషన్లు వచ్చాయి. సామాజిక, రాజకీయ, శాస్త్రసాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా ఈ అవార్డులను అందిస్తారు.
6) తెలంగాణ నుంచి ఆరుగురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. 

తెలుగు రాష్ట్రాల నుంచి గ్రహీతలు::
పేరురాష్ట్రంఅవార్డు
ఎక్కా యాదగిరి రావుతెలంగాణపద్మశ్రీ
టి.హనుమాన్ చౌదరిఆంధ్రప్రదేశ్పద్మశ్రీ
వి.కోటేశ్వరమ్మఆంధ్రప్రదేశ్పద్మశ్రీ
మహమ్మద్ అబ్దుల్ వహీద్తెలంగాణపద్మశ్రీ
చంద్రకాంత్ పితావాతెలంగాణపద్మశ్రీ
చింతకింది మల్లేశంతెలంగాణపద్మశ్రీ
దారిపల్లి రామయ్యతెలంగాణపద్మశ్రీ
బి.వి.ఆర్. మోహన్ రెడ్డితెలంగాణపద్మశ్రీ

పద్మ విభూషణ్ గ్రహీతలు::
1. యేసుదాసు (కేరళ) 
2. సద్గురు జగ్గీ వాసుదేవ్ (తమిళనాడు)
3. శరద్ పవార్ (మహారాష్ట్ర) 
4. మురళీ మనోహర్ జోషి (ఉత్తరప్రదేశ్)
5. ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు(కర్ణాటక) 
6. సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం)(మధ్యప్రదేశ్)
7. పీఏ సంగ్మా (మరణానంతరం) ( మేఘాలయ) 

పద్మ భూషణ్ గ్రహీతలు ::
1. విశ్వమోహన్ భట్ (రాజస్తాన్) 
2. ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది (ఉత్తరప్రదేశ్)
3. తెహంతోన్ ఉద్వాదియా (మహారాష్ట్ర) 
4. రత్న సుందర్ మహారాజ్ (గుజరాత్)
5. స్వామి నిరంజనానంద సరస్వతి (బిహార్) 
6. చో రామస్వామి (మరణానంతరం) ( తమిళనాడు)
7. యువరాణి మహాచక్రి సిరింధోర్న్ (థాయ్‌లాండ్)

పద్మశ్రీ గ్రహీతలు ::
బసంతి బిస్త్కున్హిరామన్ నాయర్అరుణా మొహంతి
భారతీ విష్ణువర్ధన్సాధు మెహర్టి.కె. మూర్తి
బీరేంద్రకుమార్ సింగ్కృష్ణరామ్ చౌదరిబవోవా దేవి
తిలక్ గితాయ్ఎక్కా యాదగిరిరావుజితేంద్ర హరిపాల్
కై లాష్ ఖేర్పరస్సల బి. పొన్నమ్మాళ్సుక్రి బొమ్మగౌడ
ముకుంద్ నాయక్పురుషోత్తం ఉపాధ్యాయ్అనురాధా పౌడ్వాల్
వారెప్ప నబా నీల్టి. హనుమాన్ చౌదరిటీకే విశ్వనాథన్
కన్వల్ సిబాల్బిర్ఖా లింబూ మురింగ్లాఎలి అహ్మద్
నరేంద్ర కోహ్లిజి.వెంకటసుబ్బయ్యఅచ్యుతన్ నంబూద్రి
కాశీనాథ్ పండితచాము కృష్ణశాస్త్రిహరిహర్ కృపాళు త్రిపాఠి
మైఖేల్ డానినోపూనమ్ సూరివీజీ పటేల్
వి.కోటేశ్వరమ్మబల్బీర్ దత్భావనా సోమయ్య
విష్ణు పాండ్యసుబ్రతో దాస్భక్తియాదవ్
మహ్మద్ అబ్దుల్ వహీద్మదన్ మాధవ్ గోడ్బోలేదేవేంద్ర దయాభాయ్
ప్రొఫెసర్ హరికిషన్ సింగ్ముకుట్ మింజ్అరుణ్ కుమార్ శర్మ
సంజీవ్ కపూర్మీనాక్షి అమ్మజెనాభాయ్ పటేల్
చంద్రకాంత్ పిఠావాఅజోయ్ కుమార్ రేచింతకింది మల్లేశం
జితేంద్రనాథ్ గోస్వామిదారిపల్లి రామయ్యగిరీష్ భరద్వాజ్
కరీముల్ హక్బిపిన్ గణత్రానివేదితా రఘునాథ్ భిడే
అప్పాసాహెబ్ ధర్మాధికారిబాబా బల్బీర్ సింగ్ సీచేవల్విరాట్ కోహ్లి
శేఖర్ నాయక్వికాస గౌడదీపా మాలిక్
మరియప్పన్ తంగవేలుదీపా కర్మాకర్పీఆర్ శ్రీజేష్
సాక్షి మాలిక్మోహన్ రెడ్డి వెంకట్రామఇమ్రాన్ ఖాన్
అనంత్ అగర్వాల్హెచ్‌ఆర్ షాసునీతి సాల్మన్
అశోక్ కుమార్ భట్టాచార్యడాక్టర్ మపుస్కర్అనురాధా కొయిరాలా

2.డాక్టర్ రఘురామ్‌కు బీసీ రాయ్ అవార్డు::
 1)హైదరాబాద్‌కు  చెందిన రొమ్ము కేన్సర్ నిపుణుడు డాక్టర్ పి.రఘురామ్ ప్రతిష్టాత్మక బీసీ రాయ్ జాతీయ అవార్డు-2016కు ఎంపికయ్యారు. 
2) ‘అవుట్‌స్టాండింగ్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషియో మెడికల్ రిలీఫ్’ సేవకు గుర్తింపుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయనకు ఈ అవార్డు ప్రకటించింది.
3)  జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు.

3.డా.రఘునాథరావుకు బీసీ రాయ్ పురస్కారం::
1) విశాఖలోని అగనంపూడి హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ దిగమర్తి రఘునాథరావు 2016 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.
2) క్యాన్సర్ నిరోధక సేవలతోపాటు వైద్య రంగంలోని భిన్న విభాగాల నిపుణులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ఆయన్ను అవార్డుకు ఎంపిక చేసినట్టు భారతీయ వైద్య మండలి ప్రకటించింది.

4.సైనిక పతకాలు ప్రకటించిన కేంద్రం::
1) గణతంత్ర దినోత్సవాల సందర్భంగా వివిధ దళాల సైనికులకు 398 శౌర్య, కీర్తి చక్ర ప్రకటించారు.
2) ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముష్కర స్థావరాలపై సర్జికల్ దాడి చేసిన 19 మంది సైనికులను కీర్తిచక్ర, యుధ్ సేవా తదితర మెడళ్లు, శౌర్యపతకాలతో సత్కరించారు.
3) 4వ పటాలానికి చెందిన మేజర్ రోహిత్ సూరికి శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్య పతకమైన కీర్తిచక్ర ప్రకటించారు. 
4) కమాండింగ్ అధికారులైన కపిల్ యాదవ్, హర్‌ప్రీత్ సంధులకు యుధ్‌సేవా అవార్డును ప్రకటించారు.

5.హంగ్‌పన్ దాదాకు అశోక్‌చక్ర::
1) వీర జవాన్ హంగ్‌పన్ దాదాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అశోక్‌చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.
2) ఈ పురస్కారాన్ని జనవరి 26న జరిగిన 68వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా హంగ్‌పన్ దాదా సతీమణి అందుకున్నారు. 
3) హంగ్‌పన్ జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి వారి తూటాలకు బలయ్యారు.

6.అవార్డుల జాబితా::
1) మేజర్ రోహిత్ సూరి ::కీర్తి చక్ర
2) హవల్దార్ ప్రేమ్ బహదూర్ రేస్మి మగర్కీర్తి చక్ర
3) పాండురంగ్ మహదేవ్, నాయక్ విజయ్ కుమార్సేవా మెడల్స్
4) మేజర్ ప్రవీణ్ బక్షి, మేజర్ పీఎం హరీజ్పరమ్ విశిష్ట సేవా మెడల్స్
5) కపిల్ యాదవ్, హర్‌ప్రీత్ సంధుయుధ్‌సేవా అవార్డు

7.భారత సంతతి వ్యక్తులకు ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం ::
1) ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు-2017 కు భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎంపికయ్యారు. 
2) వెద్యుడు పురుషోత్తమ్ సారికర్, న్యూరోరేడియాలజిస్ట్ మఖన్‌సింగ్ ఖన్గురే, న్యూక్లియర్ మెడిసన్ పరిశోధకుడు విజయ్ కుమార్‌లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 
3) వైద్య, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం ప్రదానం చేస్తారు.

8.జేఎన్‌టీయూహెచ్ కళాశాలకు ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ అవార్డు::
1) హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ అవార్డు దక్కింది.
2) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్-IPE అందించే దివాంగ్ మెహతా జాతీయ విద్యా అవార్డుల్లో భాగంగా ఈ కళాశాలకు పురస్కారం దక్కింది.
3) ఉత్తమ సాంకేతిక విద్య, సమర్థవంతంగా యూజీ కార్యక్రమాల అమలు, పరిశోధనా కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న దేశంలోని పది అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల గుర్తింపు పొందింది.

9.సైన్స్ సిటీ సీఈవో కృష్ణారావుకు ఎల్లాప్రగడ అవార్డు::
1) ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అవార్డుకు ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ సీఈవో, అమెరికన్ డాక్టర్ అప్పసాని కృష్ణారావు ఎంపికయ్యారు.
2)  బయాలజీ, కెమిస్ట్రీ, జెనటిక్స్, మెడికల్ సైన్‌‌సలో ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు లభించింది.
3)  నోబెల్ అవార్డ్ గ్రహీత ప్రొఫెసర్ హర్ గోవింద్ ఖొరానా లేబొరేటరీలో సింతటిక్ రోడోస్పిన్ జీన్‌ను మెదటిసారిగా కృష్ణారావు కనుగొన్నారు. 
4) పలు వ్యాధులకు మందులు కనుగొన్న ఎల్లాప్రగడ సుబ్బారావు పేరిట ఏటా ఫౌండేషన్ ఈ అవార్డు అందజేస్తుంది. 

10.ప్రియాంకకు మరోసారి పీపుల్స్ చాయిస్ అవార్డు ::
1) బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వరుసగా రెండోసారి పీపుల్స్ చాయిస్ అవార్డు అందుకుంది. 
2) అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో ఆమె నటనకుగాను (ఫేవరేట్ డ్రమటిక్ టీవీ నటి విభాగం) ఆమె పీపుల్స్ చాయిస్ అవార్డు 2017 కు ఎంపికైంది. 
3) జనవరి 19న అమెరికాలోని లాస్ ఏంజిలెస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రియాంక పురస్కారాన్ని అందుకుంది.
4)  2016లోనూ క్వాంటికో సిరీస్ విభాగంలో ప్రియాంక పీపుల్స్ చాయిస్ అవార్డు పొందింది.

11.జానీ డెప్‌కు ‘పీపుల్స్ చాయిస్’ పురస్కారం:: 
1) పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ చిత్రాల నటుడు జానీ డెప్ 2016కు గాను పీపుల్స్ చాయిస్ అవార్డు గెలుచుకున్నాడు.
2)  ‘ఫేపరేట్ మూవీ ఐకన్’ విభాగంలో డెప్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. 
3) జనవరి 18న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కార్యక్రమంలో జానీ డెప్ అవార్డు అందుకున్నాడు. 

12.తెలుగు రాష్ట్రాల పోలీసులకు రాష్ట్రపతి సేవా పథకాలు::
1) విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది.
2)  ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి 29 పతకాలు దక్కగా తెలంగాణ పోలీసులకు 16 పతకాలు లభించాయి.

ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన పతకాలు ::
రాష్ట్రపతి ఉత్తమ సేవాపతకం: ఐజీ పి.వి సునీల్ కుమార్, ఏఎస్పీ వి సురేశ్ బాబు 
  • 15 మంది పోలీసులకు ప్రతిభా పురస్కారాలు
  • 12 మంది పోలీసులకు శౌర్య పతకాలు
తెలంగాణకు దక్కిన పతకాలు ::
రాష్ట్రపతి ఉత్తమ సేవాపతకం: టి.వి. శశిధ ర్‌రెడ్డి(రాచకొండ సంయుక్త కమిషనర్ ), ఏ వెంకటేశ్వరరావు(ఏఎస్పీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్), కృష్ణ (హైదరాబాద్ సీబీఐ జాయింట్ డెరైక్టర్), సీబీఐ ఏఎస్‌ఐ సత్యనారాయణ
  • 12 మంది పోలీసులకు సేవా పతకాలు

13.25 మంది బాలలకు సాహస పురస్కారాల ప్రదానం::
 1)2016 జాతీయ సాహస బాలల పురస్కారాలను ప్రధాని మోదీ జనవరి 23న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. 
2) ఈ సందర్భంగా అవార్డులకు ఎంపికైన 25 మంది చిన్నారులకు జ్ఞాపికలను అందచేశారు. 
3) సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని ఏటా జనవరి 23న సాహస అవార్డులను ప్రదానం చేస్తారు.

14.ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తకు జాతీయ అవార్డు::
1) హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ చీఫ్ సైంటిస్టు ఎన్.పూర్ణచందర్‌రావు నేషనల్ జియోసైన్స్ అవార్డు - 2016కు ఎంపికయ్యారు. 
2) భూగర్భ అంశాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్రం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. 
3) భూకంపాలు, భూగర్భంలో జరిగే అంతర్గత మార్పులపై పూర్ణచందర్‌రావు పలు పరిశోధనలు జరిపారు.

15.62వ ఫిలింఫేర్ అవార్డులు ::
62వ ఫిలింఫేర్ అవార్డులను జనవరి 14న ముంబైలో ప్రదానం చేశారు.
ఉత్తమ చిత్రం: దంగల్, ఉత్తమ నటుడు: అమీర్‌ఖాన్ (దంగల్)
ఉత్తమ నటి: అలియాభట్ (ఉడ్తా పంజాబ్)
ఉత్తమ దర్శకుడు : నితేష్ తివారి (దంగల్)
జీవితకాల సాఫల్య పురస్కారం: శత్రుఘ్నసిన్హా

16.ఒడిషా బాలికకు జాతీయ బాలశ్రీ పురస్కారం ::
1) ఒడిశాకు చెందిన సిమ్రన్ స్వెయిన్‌కు 2015 సంవత్సరానికి గాను జాతీయ బాలశ్రీ పురస్కారం దక్కింది. 
2) ఒడిస్సీ నృత్యంలో చూపిన ప్రతిభకుగాను ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. 
3) పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు జాతీయ బాల్ భవన్ 2015 నుంచి జాతీయ బాలశ్రీ పురస్కారాలను అందజేస్తోంది.

17.తమిళనాడు వాసికి ఆస్కార్ అవార్డు::
1) తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కిరణ్ భట్ టెక్నికల్ అచీవ్‌మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు.
2)  ఐఎల్‌ఎం ఫేషియల్ పర్‌ఫార్మెన్‌‌స - క్యాప్చర్ సాల్వింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేసినందుకుగాను మరో ముగ్గురితో కలిసి కిరణ్‌కు ఈ అవార్డును ప్రకటించారు. 
3) ఫిబ్రవరిలో జరిగే 89వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఆస్కార్‌ను అందుకుంటారు.
18.లాన్‌‌సనాయక్ హనుమంతప్పకు సేనా మెడల్::
1)హిమాలయాల్లో మంచు తుపాను వల్ల మరణించిన సైనికుడు లాన్‌‌స నాయక్ హనుమంతప్పను జనవరి 15న ఆర్మీడే సందర్భంగా సేనా పతకంతో సత్కరించారు. 
2) ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సియాచిన్ యుద్ధభూమిలో 2016 ఫిబ్రవరి 3న మంచుతుపాన్‌లో 10 మంది సైనికులు సజీవ సమాధి కాగా, హనుమంతప్ప మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న మరణించాడు. 
3) కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా బెటాదుర్ గ్రామానికి చెందిన హనుమంతప్ప మద్రాస్ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేశాడు. 

19.జాతీయ సాహస పురస్కారాలు - 2016::
1) 2016వ సంవత్సరానికి జాతీయ సాహస పురస్కారాలను జనవరి 17న ప్రకటించారు. 
2) మొత్తం 25 మంది పిల్లల (13 మంది బాలురు, 12 మంది బాలికలు)ను ఈ ఏడాది సాహస పురస్కారాలకు ఎంపిక చేశారు.
3)  బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమ బెంగాల్ అమ్మాయిలు తేజస్వితా (18), శివాని(17)లు గీతా చోప్రా అవార్డుకు ఎంపికయ్యారు. 
4) అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో పచిన్ నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను కాపాడుతుండగా మరణించిన తార్హ్ పీజుకు భారత్ అవార్డు ప్రకటించారు. 
5) సోదరుడిని కాపాడేందుకు చిరుతపులితో పోరాడిన ఉత్తరాఖండ్‌కు చెందిన సుమిత్‌కు సంజయ్ చోప్రా పురస్కారం లభించింది.
అవార్డుల జాబితా::
గీతా చోప్రా అవార్డు
తేజస్వితా (18), శివాని(17)
సంజయ్ చోప్రా అవార్డు
సుమిత్ మామ్‌గెన్
భారత్ అవార్డు
తార్హ్ పీజు
బాపు గైదానీ అవార్డు
Roluahpuii, Tushar Verma and H Lalhriatpuii

20.అమితాబ్‌కు యూఎస్ ఎంబసీ అవార్డు::
1) ట్యూబర్‌క్యులోసిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమితాబ్ చేస్తున్న కృషికి అమెరికా రాయబార కార్యాలయం యూఎస్ ఎంబసీ అవార్డును అందజేసింది. 
2) జనవరి 8న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ చేతుల మీదుగా అమితాబ్ పురస్కారాన్ని అందుకున్నారు.

21.ఇస్కా అవార్డులు ప్రదానం::
1) తిరుపతిలో జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్‌లో 20 మంది భారత శాస్త్రవేత్తలకు 2016కుగానూ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఇస్కా) పురస్కారాలను ప్రదానం చేశారు. గతంలో ఇస్కా సదస్సులకు జనరల్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన అశోక్ కుమార్ సక్సేనాకు శాస్త్రవేత్త అశుతోష్ ముఖర్జీ మెమోరియల్ అవార్డు లభించింది. 
2) దీంతోపాటు నోబెల్ పురస్కార గ్రహీతలైన ప్రొ. మోర్నార్ విలియం ఎస్కో (అమెరికా), మహ్మద్ యూనస్ (బంగ్లాదేశ్), ప్రొ.టకాకి కజిటా (జపాన్), ప్రొ. సర్జే హరోచి (ఫ్రాన్స్), ప్రొ. అడా ఇ యనాత్ (ఇజ్రాయెల్), ప్రొ.టిరోలే (ఫ్రాన్స్)లకు బంగారు పతకాలను ప్రదానం చేశారు.
3) బాలల సైన్స్ కాంగ్రెస్: జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా మూడు రోజుల బాలల కాంగ్రెస్‌ను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రబాబునాయడు జనవరి 4న ప్రారంభించారు.

22.లయన్ సినిమాకు జ్యూరిచ్ ఫిల్మ్ అవార్డు::
1) భారత సంతతి నటుడు దేవ్‌పాటిల్, సన్నీ పావర్‌లు నటించిన లయన్ సినిమాకు ప్రతిష్టాత్మక జ్యూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్ (డైవర్శిటీ ఇన్ ఫిల్మ్) అవార్డు లభించింది. 
1) 2016 సెప్టెంబరులో విడుదలైన ఈ సినిమాను గార్త్ డెవిస్ రూపొందించారు. రోనీ మారా, నికోల్ కిడ్‌మాన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
2) ఆస్ట్రేలియాకు చెందిన సారూ బ్రీర్లీ గూగుల్ ఎర్త్ ఆధారంగా భారత్‌లో నివసిస్తున్న తన కుటుంబం ఆచూకీ తెలుసుకునే అంశంపై సినిమా సాగుతుంది.

23.భారతీయ ప్రొఫెసర్ శంకర్ సుబ్రమణియన్ కు నైట్‌హుడ్::
1) భారత సంతతికి చెందిన బ్రిటిష్ ప్రొఫెసర్ శంకర్ సుబ్రమణియన్(50)ను బ్రిటన్ ప్రభుత్వం నైట్‌హుడ్ హోదాతో సత్కరించింది. 
2) ప్రస్తుతం ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్నారు. 
3) డీఎన్‌ఏ అనుక్రమణాన్ని కనుగొన్న పరిశోధకుల్లో ఒకరిగా శంకర్‌కు గుర్తింపు ఉంది. 
4) ‘సొలెక్సా సీక్వెన్సింగ్’ అని పిలిచే ఈ విధానం ద్వారా 1000 పౌండ్ల కన్నా తక్కువ ఖర్చుతో కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే జన్యువు అనుక్రమణాన్ని పూర్తి చేయొచ్చు. 
5) గతంలో దీనికి బిలియన్ పౌండ్ల వ్యయంతో పాటు కొన్నేళ్ల సమయం పట్టేది.

24.ఆండీ ముర్రే, మో ఫరాకు నైట్‌హుడ్ పురస్కారం::
1) బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే, ప్రఖ్యాత అథ్లెట్ మో ఫరాలకు ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ పురస్కారం దక్కింది. 
2) ఈ మేరకు డిసెంబర్ 30న రెండో ఎలిజబెత్ రాణి నూతన సంవత్సర గౌరవ పురస్కారాల జాబితాను ప్రకటించింది. 
3) వీరితో పాటు పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన లీ పియర్సన్‌కు కూడా ఈ అవార్డు దక్కింది. 
4)29 ఏళ్ల ముర్రే 2016లో వింబుల్డన్ టైటిల్ నెగ్గడంతోపాటు రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. 
5) తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
6)మో ఫరా రియో ఒలింపిక్స్‌లో తొలిసారిగా నాలుగు స్వర్ణాలు గెలిచిన తొలి బ్రిటిష్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.