ఎంపీ కవితకు నారీ ప్రతిభా పురస్కారంప్రతిష్టాత్మక నారీ ప్రతిభా పురస్కారాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అందుకున్నారు. యువత, మహిళా సాధికారత కోసం కృషి చేసినందుకుగాను కేంద్ర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రెజైస్ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వశాఖ, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ సంయుక్తంగా ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి. ఈ మేరకు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ ఇండియా చైర్‌పర్సన్ డాక్టర్ టి.వసంతలక్ష్మి కవితకు ఆగస్టు 24న హైదరాబాద్‌లో అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
మొదటిసారి ప్రవేశపెట్టిన నారీ ప్రతిభా పురస్కార్-2017ను ఎంపీ కవితతోపాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కల్పకం ఏచూరి, ఆషా ప్రకాశ, స్మృతి నాగపాల్, ప్రియా భార్గవ, షిర్లే అబ్రహం అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ ‘షీ’టీమ్స్ బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా కూడా అవార్డు అందుకున్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు - 2017ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. 2017 జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో అత్యున్నత అవార్డు రాజీవ్‌గాంధీ ఖేల్త్న్రను పారాలింపియన్ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు రూ.7.5 లక్షల చొప్పున చెక్‌ను అందించారు. మొత్తంగా 17 మంది క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకోగా.. ముగ్గురికి ధ్యాన్‌చంద్, ఏడుగురికి ద్రోణాచార్య అవార్డులు అందాయి. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు. అవార్డు గ్రహీతలు ఖేల్త్న్ర: దేవేంద్ర జజరియా(పారాథ్లెట్, జావెలిన్ త్రో), సర్దార్‌సింగ్ (హాకీ). అర్జున: సాకేత్ మైనేని (టెన్నిస్), జ్యోతి సురేఖ (ఆర్చరీ), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), బెంబేమ్ దేవి (ఫుట్‌బాల్), ఎస్‌ఎస్‌పీ చౌరాసియా (గోల్ఫ్), ఎస్‌వీ సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాష్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్‌రాజ్ (టీటీ), సత్యవర్త్ కడియాన్ (రెజ్లింగ్), తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెట్స్). పుజారా (క్రికెట్). ద్రోణాచార్య: దివంగత డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్), జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్ (బ్యాడ్మింటన్), బీబీ మహంతి (బాక్సింగ్), హీరానంద్ (కబడ్డీ), రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్ లాల్ (రెజ్లింగ్). ద్యాన్‌చంద్: భూపిందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయ్యద్ షాహిద్ హకీమ్ (ఫుట్‌బాల్), సుమరాయ్ టెటే (హాకీ). క్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదంక్రీడా పురస్కారాల కమిటీ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆగస్టు 19న ఆమోదం తెలిపింది. అయితే ఈ జాబితా నుంచి క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న పారా స్పోర్‌ట్స కోచ్ సత్యనారాయణను ద్రోణాచార్య నామినీ నుంచి తప్పించింది. రియో పారాలింపిక్స్ చాంపియన్, హైజంపర్ మరియప్పన్ తంగవేలు కోచ్ అయిన సత్యనారాయణ (కర్ణాటక) క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదొక్కటి మినహా సీకే ఠక్కర్ నేతృత్వంలోని కమిటీ సిఫారసులన్నింటికీ కేంద్రం ఆమోదముద్ర వేసింది. అవార్డు గ్రహీతలురాజీవ్ ఖేల్త్న్ర: దేవేంద్ర జజారియా, సర్దార్ సింగ్. అర్జున: జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్ మైనేని (టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి (బాస్కెట్‌బాల్), దేవేంద్రో సింగ్ (బాక్సింగ్), పుజారా, హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్), చౌరాసియా (గోల్ఫ్), సునీల్ (హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ నంజప్ప (షూటింగ్), ఆంథోనీ అమల్ రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్). ద్రోణాచార్య అవార్డు: డా.ఆర్ గాంధీ(అథ్లెటిక్స్), హీరానంద్ కటారియా(కబడ్డీ), జీఎస్‌వీ ప్రసాద్(బ్యాడ్మింటన్), బ్రిజ్ భూషన్ మహంతి(బాక్సింగ్), రోషన్ లాల్(రెజ్లింగ్),రాఫెల్,(హాకీ), సంజయ్ చక్రవర్తి(షూటింగ్) ధ్యాన్‌చంద్ అవార్డు: భూపిందర్ సింగ్(అథ్లెటిక్స్),సయ్యద్ షాహీద్ హకీం (ఫుట్ బాల్), సుమరాయ్ టకే(హాకీ) పద్మ అవార్డులకు ఎవరైనా నామినేట్ చేయవచ్చు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పద్మ అవార్డులకు నామినేషన్లు ఎవరైనా ప్రతిపాదించవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు 2018 ఏడాదికి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్ర హోంశాఖ ఆగస్టు 18న ప్రకటన విడుదల చేసింది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్‌స, ఇంజనీరింగ్, వాణిజ్యం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. ప్రజలందరూ తమ ప్రతిపాదనలను అధికారిక వెబ్‌సైబ్ www.padmaawards.gov.in కు సెప్టెంబర్ 15లోగా పంపాలి. కేవలం ఆన్‌లైన్ ద్వారానే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. పద్మ అవార్డుల కమిటీ అవార్డుల ప్రదానంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. గతంలో రాజకీయ నేతలు, మంత్రులు సిఫార్సు చేసినవారికే పద్మ అవార్డులు అందేవి. రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీకి జాతీయ పురస్కారంతూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ అసెట్‌కు ప్రతిష్టాత్మకమైన జాతీయ భద్రతా పురస్కారం (మైన్‌స)-2013 లభించింది. సురక్షితమైన డ్రిల్లింగ్ (ఆ ప్రక్రియలో సిబ్బంది గాయపడిన సందర్భాలు అతి తక్కువగా ఉండడం)లో ఈ పురస్కారానికి ఎంపికైంది. అసెట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, మేనేజర్ డీఎంఆర్ శేఖర్ ఆగస్టు 17న న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అసెట్ 2011, 2012 సంవత్సరాల్లో కూడా జాతీయ భద్రతా పురస్కారాన్ని గెలుచుకుంది. ‘బస్తర్’ పోలీసులకు అంతర్జాతీయ అవార్డు ఉత్తమ పోలీసు సేవలకుగాను చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పోలీసులకు ఈ ఏడాది ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఐఏసీపీ అవార్డు దక్కింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ‘ఆమ్‌ఛో బస్తర్, ఆమ్‌ఛో పోలీస్’ పేరుతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావడంతో బస్తర్ పోలీసు విభాగాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. జిల్లా సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ ఆరిఫ్ షేక్ అమెరికాలో అక్టోబర్ 24న జరిగే ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఐదుగురికి కీర్తిచక్ర, 17 మందికి శౌర్య పురస్కారాలు ఉగ్రవాదులపై పోరులో అమరులైన ఇద్దరు సైనికులతో పాటు ఐదుగురు భద్రతా దళాల సిబ్బందిని దేశ రెండో అత్యున్నత గాలంట్రీ అవార్డు అయిన కీర్తిచక్రకు ఎంపికచేశారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 112 శౌర్య పురస్కారాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 14న ఆమోదం తెలిపారు. వీటిలో ఐదు కీర్తి చక్ర, 17 శౌర్యచక్ర, 85 సేనా మెడల్స్, మూడు నౌకాదళ సేనా మెడల్స్, రెండు వాయుసేన మెడల్స్ ఉన్నాయి. హవిల్దార్ గిరిస్ గురుంగ్ (గూర్ఖా రైఫిల్స్), మేజర్ డేవిడ్ మన్‌లన్(నాగా రెజిమెంట్), ప్రమోద్ కుమార్ (సీఆర్‌పీఎఫ్ 49 బెటాలియన్ కమాండెంట్)లు మరణానంతరం కీర్తిచక్రకు ఎంపికయ్యారు. మేజర్ ప్రీతం సింగ్ కున్వర్ (గర్వాల్ రైఫిల్), చేతన్ కుమార్ చీతా (సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారి)లు కూడా ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. దేశ అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్రకు ఎవరినీ ఎంపిక చేయలేదు. మే 20న జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక పోరులో హవిల్దార్ గురుంగ్ అమరుడయ్యారు. తీవ్రంగా గాయపడ్డా.. ధైర్య సాహసాల్ని ప్రదర్శిస్తూ ఉగ్రవాది వైపుకు దూసుకెళ్లి కాల్పులు జరిపారు. జూన్ 6న నాగాలాండ్‌లో తీవ్రవాదులతో ఎదురుకాల్పుల్లో మేజర్ మన్‌లన్ ప్రాణాలు కోల్పోయారు. మే 25న కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరులో చూపిన తెగువకు మేజర్ కున్వర్ కీర్తిచక్రకు ఎంపికయ్యారు. సాహస పతకాలకు హోం శాఖ 190 మందిని ఎంపిక చేయగా.. వీరిలో ఛత్తీస్‌గఢ్‌లో మావోల దాడిలో అమరులైన 53 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఏపీ, తెలంగాణకు సేవా పతకాలు విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే అత్యుత్తమ సేవా పతకాలను కేంద్రం ఆగస్టు 14న ప్రకటించింది. దేశవ్యాప్తంగా 190 మందికి పోలీసు శౌర్య పతకాలు, 93 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 706 మందికి అత్యుత్తమ సేవా పతకాలు కలుపుకొని మొత్తం 990 పతకాలను ప్రకటించింది. తెలంగాణకు 13 పతకాలు ఈ సారి తెలంగాణ రాష్ట్రం నుంచి 13 మంది పోలీసు అధికారులు ఈ పతకాలకు ఎంపికయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, మెట్రో రైల్ విభాగంలో పని చేస్తున్న అదనపు డీసీపీ ఎ.బాలకృష్ణలకు రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం) దక్కాయి. కేంద్ర హోం శాఖ ఆగస్టు 14న ఈ మేరకు ప్రకటించింది. మరో 11 మంది పోలీసు అధికారులకు ఇండియన్ పోలీస్ మెడల్స్ దక్కాయి. ప్రత్యేక మహిళా కారాగారం చీఫ్ హెడ్‌వార్డర్ ఎ.ప్రమీలా బాయికి రాష్ట్రపతి కరెక్షనల్ సర్వీస్ మెడల్ దక్కింది. ఏపీకి 67 పతకాలు రాష్ట్రం నుంచి 67 మంది పోలీసు అధికారులు సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో 52 పోలీసు శౌర్య, 3 రాష్ట్రపతి విశిష్ట సేవ, 12 అత్యుత్తమ సేవా పతకాలు ఉన్నాయి. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు ఈ ఏడాది కిగాను ఏపీలోని విజయవాడ ఏసీబీ జాయింట్ డెరైక్టర్ కేవీ లక్ష్మీనాయక్, కర్నూలు ఆర్‌ఐవో ఏఎస్పీ దొడ్లా నరహరి, విజయనగరం ఏఎస్‌ఐ కొటారి ప్రసాద్ రావులకు దక్కాయి. రాష్ట్రపతి శౌర్య పతకం ఈ ఏడాది ఒక్కరికే ప్రకటించగా.. అది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దివంగత ప్లటూన్ కమాండర్ శంకర్‌రావుకు దక్కింది. భారతీయ అమెరికన్ ప్రొఫెసర్‌కు జీవనసాఫల్య పురస్కారంమోడ్రన్ కమ్యూనికేషన్‌స రంగంలో విశిష్ట సేవలు అందించిన భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ థామస్ కైలత్‌కు అమెరికా కేంద్రంగా పనిచేసే మార్కోనీ సొసైటీ జీవనసాఫల్య పురస్కారాన్ని అందజేసింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించడంతో కైలత్‌ను భారత ప్రభుత్వం 2009లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రేడియోను కనుగొన్న నోబెల్ గ్రహీత గుగ్లిల్మో మార్కోనీ పేరు మీద ఈ సొసైటీని 1975లో స్థాపించారు. మానవులకు సృజనాత్మక సేవలు అందించిన వారికి ఇది జీవన సాఫల్య పురస్కారం అందజేస్తుంది. కై లత్ 1935లో పుణేలో జన్మించారు. స్వదేశంలో ఇంజనీరింగ్ చదివాక 1957లో అమెరికా వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేశారు. దేవేంద్ర జఝరియాకు రాజీవ్ ఖేల్త్న్ర భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్త్న్ర’ అందుకోనున్నాడు. ఈ అవార్డు చరిత్రలో ఓ పారాలింపియన్ ఎంపికవడం ఇదే తొలిసారి. అవార్డుల కమిటీ ఇతనితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌ను ఖేల్త్న్ర కోసం సిఫార్సు చేసింది. దేవేంద్ర జఝరియా పారాలింపిక్స్ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు(2004, 2016) గెలుపొందాడు. ఈ మేరకు రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ జావెలిన్ త్రోయర్ జఝరియాకు ఖేల్త్న్రలో తొలి ప్రాధాన్యమిచ్చింది. మరో 17 మందిని ‘అర్జున’ అవార్డుకు నామినేట్ చేసింది. తెలుగు క్రీడాకారులు సాకేత్ మైనేని, వెన్నం జ్యోతి సురేఖ ఈ జాబితాలో ఉన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్, టెస్టు క్రికెటర్ చతేశ్వర్ పుజారాలు ‘అర్జున’కు నామినేట్ అయ్యారు. త్వరలోనే కేంద్ర క్రీడాశాఖ ఈ జాబితాకు ఆమోదం తెలపగానే జాతీయ క్రీడా దినోత్సవమైన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 29) రోజు అవార్డులను ప్రదానం చేస్తారు. అర్జున అవార్డు నామినీల జాబితా
ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు భారత్‌లో తొలి హరిత మెట్రో అవార్డుని ఢిల్లీ మెట్రో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ గ్రీన్ మెట్రో సిస్టమ్స్ సమావేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డంగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ అవార్డుని ఢిల్లీ మెట్రోకి ప్రకటించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఫేస్ - 3లో స్టేషన్లు, డిపోలు, సబ్ స్టేషన్‌లను హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది. ట్రిపుల్ ఐటీ హెచ్‌వోడీకి భారత్ విద్యారత్న అవార్డుబాసరలోని ట్రిపుల్ ఐటీలో రసాయన శాస్త్ర విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రవి వరాల అత్యున్నత భారత్ విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 5న జరిగిన ఓ కార్యక్రమంలో రవి వరాల ఇంటర్‌నేషనల్ బిజినెస్ కౌన్సెల్ ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు. విద్యాబోధన క్షేత్రంలో తనదైన నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ధ్యాన్‌చంద్ పురస్కారానికి సిఫార్సైన హకీమ్ భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు. దేవ్‌పటేల్‌కు గేమ్ చేంజర్స్ అవార్డుస్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన దేవ్ పటేల్ ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2017 సంవత్సరానికి గాను మరో తొమ్మిది మందితో కలిసి ఆయన ఈ అవార్డు అందుకోనున్నాడు. 2017 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది. కేవలం ఐదారేళ్ల వ్యవధిలోనే దేవ్ పటేల్ ఓ గొప్ప స్టార్‌గా అవతరించాడని, సినిమాలతోపాటు టీవీ షోలలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, కేవలం కథానాయకుడిగానేకాదు.. భారత ప్రేక్షకులకు, పాశ్చాత్య దేశాల ప్రేక్షకులకు మధ్య వారధిని నిర్మించాడని పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. ఇక సేవా కార్యక్రమాల కోసం దేవ్‌పటేల్ చేస్తున్న ఖర్చు కూడా చాలా ఎక్కువేనని, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటిదాకా 2,50,000 డాలర్లను దేవ్ ఖర్చుచేయడం తమను ఎంతగానో ఆకర్షించిందని జ్యూరీ వ్యాఖ్యానించింది. భారత వ్యాపారవేత్తకు యూఏఈ పురస్కారంజైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించడంలో ప్రత్యేక చొరవ చూపిన భారత వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన ఇటీవల యూఏఈ ఉపప్రధాని హెచ్‌హెచ్ షేఖ్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ మెడల్‌ను స్వీకరించారు. | |||||||||||||||||
Wednesday, 23 August 2017
ఆగస్టు 2017 స్పోర్ట్స్
ఆగస్టు 2017 అవార్డ్స్
దేవేంద్ర జఝరియాకు రాజీవ్ ఖేల్త్న్ర భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్త్న్ర’ అందుకోనున్నాడు. ఈ అవార్డు చరిత్రలో ఓ పారాలింపియన్ ఎంపికవడం ఇదే తొలిసారి. అవార్డుల కమిటీ ఇతనితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌ను ఖేల్త్న్ర కోసం సిఫార్సు చేసింది. దేవేంద్ర జఝరియా పారాలింపిక్స్ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు(2004, 2016) గెలుపొందాడు. ఈ మేరకు రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ జావెలిన్ త్రోయర్ జఝరియాకు ఖేల్త్న్రలో తొలి ప్రాధాన్యమిచ్చింది. మరో 17 మందిని ‘అర్జున’ అవార్డుకు నామినేట్ చేసింది. తెలుగు క్రీడాకారులు సాకేత్ మైనేని, వెన్నం జ్యోతి సురేఖ ఈ జాబితాలో ఉన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్, టెస్టు క్రికెటర్ చతేశ్వర్ పుజారాలు ‘అర్జున’కు నామినేట్ అయ్యారు. త్వరలోనే కేంద్ర క్రీడాశాఖ ఈ జాబితాకు ఆమోదం తెలపగానే జాతీయ క్రీడా దినోత్సవమైన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 29) రోజు అవార్డులను ప్రదానం చేస్తారు.
అర్జున అవార్డు నామినీల జాబితా
ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు భారత్‌లో తొలి హరిత మెట్రో అవార్డుని ఢిల్లీ మెట్రో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ గ్రీన్ మెట్రో సిస్టమ్స్ సమావేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డంగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ అవార్డుని ఢిల్లీ మెట్రోకి ప్రకటించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఫేస్ - 3లో స్టేషన్లు, డిపోలు, సబ్ స్టేషన్‌లను హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది.
ట్రిపుల్ ఐటీ హెచ్‌వోడీకి భారత్ విద్యారత్న అవార్డుబాసరలోని ట్రిపుల్ ఐటీలో రసాయన శాస్త్ర విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రవి వరాల అత్యున్నత భారత్ విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 5న జరిగిన ఓ కార్యక్రమంలో రవి వరాల ఇంటర్‌నేషనల్ బిజినెస్ కౌన్సెల్ ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు. విద్యాబోధన క్షేత్రంలో తనదైన నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు.
గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
ధ్యాన్‌చంద్ పురస్కారానికి సిఫార్సైన హకీమ్ భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు.
దేవ్‌పటేల్‌కు గేమ్ చేంజర్స్ అవార్డుస్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన దేవ్ పటేల్ ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2017 సంవత్సరానికి గాను మరో తొమ్మిది మందితో కలిసి ఆయన ఈ అవార్డు అందుకోనున్నాడు. 2017 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది.
కేవలం ఐదారేళ్ల వ్యవధిలోనే దేవ్ పటేల్ ఓ గొప్ప స్టార్‌గా అవతరించాడని, సినిమాలతోపాటు టీవీ షోలలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, కేవలం కథానాయకుడిగానేకాదు.. భారత ప్రేక్షకులకు, పాశ్చాత్య దేశాల ప్రేక్షకులకు మధ్య వారధిని నిర్మించాడని పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. ఇక సేవా కార్యక్రమాల కోసం దేవ్‌పటేల్ చేస్తున్న ఖర్చు కూడా చాలా ఎక్కువేనని, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటిదాకా 2,50,000 డాలర్లను దేవ్ ఖర్చుచేయడం తమను ఎంతగానో ఆకర్షించిందని జ్యూరీ వ్యాఖ్యానించింది.
భారత వ్యాపారవేత్తకు యూఏఈ పురస్కారంజైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించడంలో ప్రత్యేక చొరవ చూపిన భారత వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన ఇటీవల యూఏఈ ఉపప్రధాని హెచ్‌హెచ్ షేఖ్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ మెడల్‌ను స్వీకరించారు.
అర్జున అవార్డు నామినీల జాబితా
| జ్యోతి సురేఖ (ఆర్చరీ) | చౌరాసియా (గోల్ఫ్) |
| సాకేత్ మైనేని (టెన్నిస్) | పుజారా (క్రికెట్) |
| ఖుష్బీర్ కౌర్ (అథ్లెటిక్స్) | హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్) |
| అరోకిన్ రాజీవ్ (అథ్లెటిక్స్) | ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్) |
| దేవేంద్రో సింగ్ (బాక్సింగ్) | ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్) |
| ఎస్వీ సునీల్ (హాకీ) | జస్వీర్‌సింగ్ (కబడ్డీ) |
| ప్రకాశ్ (షూటింగ్) | అమల్‌రాజ్ (టేబుల్ టెన్నిస్) |
| సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్) | వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్) |
| మరియప్పన్ తంగవేలు(పారా అథ్లెటిక్స్) |
ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు భారత్‌లో తొలి హరిత మెట్రో అవార్డుని ఢిల్లీ మెట్రో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ గ్రీన్ మెట్రో సిస్టమ్స్ సమావేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డంగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ అవార్డుని ఢిల్లీ మెట్రోకి ప్రకటించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఫేస్ - 3లో స్టేషన్లు, డిపోలు, సబ్ స్టేషన్‌లను హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది.
ట్రిపుల్ ఐటీ హెచ్‌వోడీకి భారత్ విద్యారత్న అవార్డుబాసరలోని ట్రిపుల్ ఐటీలో రసాయన శాస్త్ర విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రవి వరాల అత్యున్నత భారత్ విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 5న జరిగిన ఓ కార్యక్రమంలో రవి వరాల ఇంటర్‌నేషనల్ బిజినెస్ కౌన్సెల్ ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు. విద్యాబోధన క్షేత్రంలో తనదైన నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు.
గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
ధ్యాన్‌చంద్ పురస్కారానికి సిఫార్సైన హకీమ్ భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు.
దేవ్‌పటేల్‌కు గేమ్ చేంజర్స్ అవార్డుస్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన దేవ్ పటేల్ ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2017 సంవత్సరానికి గాను మరో తొమ్మిది మందితో కలిసి ఆయన ఈ అవార్డు అందుకోనున్నాడు. 2017 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది.
కేవలం ఐదారేళ్ల వ్యవధిలోనే దేవ్ పటేల్ ఓ గొప్ప స్టార్‌గా అవతరించాడని, సినిమాలతోపాటు టీవీ షోలలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, కేవలం కథానాయకుడిగానేకాదు.. భారత ప్రేక్షకులకు, పాశ్చాత్య దేశాల ప్రేక్షకులకు మధ్య వారధిని నిర్మించాడని పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. ఇక సేవా కార్యక్రమాల కోసం దేవ్‌పటేల్ చేస్తున్న ఖర్చు కూడా చాలా ఎక్కువేనని, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటిదాకా 2,50,000 డాలర్లను దేవ్ ఖర్చుచేయడం తమను ఎంతగానో ఆకర్షించిందని జ్యూరీ వ్యాఖ్యానించింది.
భారత వ్యాపారవేత్తకు యూఏఈ పురస్కారంజైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించడంలో ప్రత్యేక చొరవ చూపిన భారత వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన ఇటీవల యూఏఈ ఉపప్రధాని హెచ్‌హెచ్ షేఖ్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ మెడల్‌ను స్వీకరించారు.
జులై 2017 అవార్డ్స్
బుకర్ ప్రైజ్ జాబితాలో అరుంధతీ రాయ్ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ రాసిన ‘ద మినిస్ట్రీ ఆఫ్ అట్‌మోస్ట్ హ్యాపీనెస్’ పుస్తకం మ్యాన్ బుకర్ ప్రైజ్ జాబితాలో చోటు సంపాదించింది. 2016 అక్టోబర్ 1 నుంచి ప్రచురితమైన వాటిలో 13 పుస్తకాలు ఈ జాబితాకు ఎంపికయ్యాయి. ఐదుగురు జడ్జీలతో కూడిన ప్యానెల్ 144 పుస్తకాల నుంచి వీటిని ఎంపిక చేసింది. వీటిలో తుది జాబితాకు ఎంపికైన ఆరు పుస్తకాల వివరాలను సెప్టెంబర్ 13న వెల్లడిస్తుంది. బుకర్ ప్రైజ్ విజేతను అక్టోబర్ 17న ప్రకటిస్తుంది. విజేతకు రూ.41.5 లక్షల(50 వేల పౌండ్ల) మొత్తాన్ని బహుమతిగా అందిస్తుంది.
రామన్ మెగసెసె అవార్డు - 2017సమాజ సేవ, పర్యావరణ-సాంస్కృతిక పరిరక్షణ తదితర రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఐదుగురు 2017 సంవత్సరానికి గాను రామన్ మెగసెసే అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే కళలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషనల్ థియేటర్ ట్రస్ట్ కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. ఆగస్టు 31న మనీలాలో జరిగే కార్యక్రమంలో వీరికి అవార్డును అందజేస్తారు. రామన్ మెగసెసే అవార్డు ఆసియాన్ నోబెల్‌గా ప్రసిద్ధి చెందింది.
ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే గౌరవార్థం ఈ అవార్డుని 1957లో ప్రారంభించారు.
2017 అవార్డు గ్రహీతలు
గ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత్‌కు 2 అవార్డులుఅమెరికాలో నిర్వహించిన మొదటి గ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థుల బృందం రెండు అవార్డులు గెలుచుకుంది. వాషింగ్టన్‌లో జూలై 19న ముగిసిన మూడు రోజుల అంతర్జాతీయ పోటీల్లో 157 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ముంబైకి చెందిన 15 ఏళ్ల రాకేశ్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ఝంగ్ హెంగ్ ఇంజనీరింగ్ డిజైన్‌కు బంగారు పతకం, గ్లోబల్ చాలెంజ్ మ్యాచ్ డిజైన్‌కు కాంస్య పతకం దక్కాయి.
ఐఫా అవార్డులు - 201718వ ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ)-2017 అవార్డుల ప్రదానోత్సవం జూలై 16న అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’ నిలిచింది. పింక్ సినిమాకుగాను అనిరుధ్ రాయ్ చౌదరీకి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. సంగీత దర్శకుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు.
అవార్డులు
మంగళంపల్లి పేరిట రూ. 10 లక్షల అవార్డుప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఏటా ఆయన జయంతి రోజున ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడికి రూ.10 లక్షల నగదు అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలమురళీకృష్ణ 87వ జయంతి వేడుకలను జూలై 6న నిర్వహించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బాలమురళీకృష్ణ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ బాలమురళీకృష్ణ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో ఆయన పేరిట మ్యూజియం, సంగీత కళాశాల, మెమోరియల్ ట్రస్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాలమురళీకృష్ణ జన్మించిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గుంటూరు సంగీత కళాశాలకు ‘బాలమురళీకృష్ణ సంగీత కళాశాల’గా నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు స్పోర్‌ట్స ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్ ఆధ్వర్యంలో మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదానోత్సవం జూలై 7న ముంబైలో జరిగింది. ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ‘స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకోగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ : పీవీ సింధు
కోచ్ ఆఫ్ ది ఇయర్ : పుల్లెల గోపీచంద్
టీమ్ ఆఫ్ ది ఇయర్ : పురుషుల జూనియర్ హాకీ జట్టు
లివింగ్ లెజెండ్ : మిల్కా సింగ్
గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ : లోకేశ్ రాహుల్
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ : అభినవ్ బింద్రా
టీఎస్‌ఆర్టీసీకి ‘ఇండియా బస్’ పురస్కారాలుఅశోక్ లేలాండ్, అభిబస్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా బస్’ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మూడు పురస్కారాలను సొంతం చేసుకుంది. జూలై 9న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల చేతుల మీదుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు నాగరాజు, వేణులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఎక్సలెన్‌స ఇన్ బస్ ట్రాన్‌సపోర్టేషన్, ఎక్సలెన్‌స ఇన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్, టాప్ బస్ డ్రైవర్ అనే అంశాల్లో ఆర్టీసీ ఈ పురస్కారాలను పొందింది.
ఆచార్య ఇనాక్‌కు రావూరి స్మారక పురస్కారంప్రఖ్యాత కథకుడు, భాషా పరిశోధకుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ 2017 సంవత్సరానికి డాక్టర్ రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రావూరి భరద్వాజ, కాంతమ్మ ట్రస్ట్ నిర్వాహకులు రావూరి కోటేశ్వరరావు, సాయి సుమంత్ జూన్ 28న ఒక ప్రకటన విడుదల చేశారు. జీవీఆర్ ఫౌండేషన్ సహకారంతో జూలై 5వ తేదీన హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో ఈ పురస్కారాన్ని ఇనాక్‌కు ప్రదానం చేస్తారు.
భారతీయ అమెరికన్లకు గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డుఇద్దరు భారతీయ అమెరికన్లకు 2017కిగాను గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు వరించింది. అడోబ్ అధిపతి శంతను నారాయణ్, అమెరికా మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తిలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దేశం ముందంజ వేయడానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం దక్కింది.
బ్రిటన్‌లో జన్మించిన మూర్తిని 2014లో అమెరికా సర్జన్ జనరల్‌గా ఒబామా నియమించారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మూర్తిని ఆ పదవి నుంచి తొలగించారు. నారాయణ్ హైదరాబాద్‌లో జన్మించారు. నారాయణ్ యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ మెంబర్‌గా పని చేశారు.
దశరథరామిరెడ్డికి ఔట్ స్టాండింగ్ సిటిజన్ అవార్డు వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ దశరథ రామిరెడ్డికి గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ సంస్థ ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును ప్రకటించింది. జూలై 1న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
వాణిజ్య రంగంలో చేసిన సేవలకు గాను గుంటూరుకు చెందిన జాస్తి రమేశ్‌కు ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును అందజేశారు.
ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) జూన్ 28న ముంబై జైలులో మరణించాడు. దావూద్ ఇబ్రహీంకు దోసా అత్యంత సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని టాడా ప్రత్యేక కోర్టు ఈ నెల 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ముంబైలో మారణహోమం సృష్టించడానికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్ నుంచి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా దిఘీకి, పాకిస్తాన్‌కు దోసా సరఫరా చేశాడు.
ఇస్రో మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య మృతిభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య(75)జూన్ 29న బెంగళూరులో మృతి చెందారు. ఆయన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సోదరుడు. వెంకటయ్య అంతరిక్ష పరిశోధన సంస్థలో డెరైక్టర్‌గా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బృందంలో శాస్త్రవేత్తగా సేవలందించారు.
చుక్కా వెంకటయ్య జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 1937 జూన్ 30న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గూడూరులో జరిగింది. రామయ్య సహకారంతో చదువులో బాగా రాణించారు. హైదరాబాద్‌లో పదో తరగతి చదివారు. వెంకటయ్య ఈ ప్రాంతం నుంచి ఐఐటీలో సీటు సాధించిన మొదటి వ్యక్తి.
ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్’ పేరుతో స్టేట్స్‌మన్ గ్రూప్ ప్రచురించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2న రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ప్రధానిగా విధులు నిర్వహించడంలో ప్రణబ్ నుంచి సాయం అందుకునే అదృష్టం తనకు దక్కిందన్నారు. గత మూడేళ్లలో తమ మధ్య జరిగిన భేటీల్లో ఆయన తనను కొడుకులా ఆదరించారని పేర్కొన్నారు.
నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్నూతన అటార్నీ జనరల్(15వ)గా 86 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వేణుగోపాల్ నియామకానికి జూన్ 30న ఆమోదం తెలిపారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు ఉంటారు. ఇంతకముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ జూన్ 18న పదవీ విరమణ చేశారు. రాజ్యాంగ నిపుణుడైన వేణుగోపాల్ గతంలో పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ జ్యోతి21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అచల్‌కుమార్ జ్యోతిని కేంద్రం నియమించింది. ప్రధాని మోదీ సీఎంగా ఉన్న సమయంలో జ్యోతి గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సీఈసీగా నసీం జైదీ పదవీకాలం జూలై 6తో ముగియడంతో అచల్‌ను నియమిస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
గుజరాత్ సీఎస్‌గా రిటైర్ అయిన జోతి గుజరాత్ విజిలెన్‌స కమిషనర్‌గా, 1999- 2004 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్టు చైర్మన్‌గా, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేశారు.
పెరూలో అమెరికా రాయబారిగా కృష్ణభారత సంతతికి చెందిన సీనియర్ దౌత్య అధికారి, తెలుగు తెలిసిన వ్యక్తి కృష్ణ ఆర్ ఆర్స్.. పెరూలో అమెరికా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. ఆయనకు అమెరికా విదేశాంగ శాఖలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1986 నుంచి దౌత్య అధికారిగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు.
ఐటీబీపీ డెరైక్టర్ జనరల్‌గా పచ్‌నందఇండో టిబెటన్ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి ఆర్.కె.పచ్‌నంద జూన్ 30న బాధ్యతలు చేపట్టారు. ఆయన 1983 బ్యాచ్ పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. పచ్‌నంద 2018 అక్టోబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

- యోషియాకి ఇషిజవా - జపాన్
- గెత్సీ షన్ముగమ్ - శ్రీలంక
- అబ్డాన్ నబాన్ - ఇండోనేషియా
- టోని టాయ్ - సింగపూర్
- లిలియా డీ లిమా - ఫిలిప్పీన్స్
- ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషనల్ థియేటర్ ట్రస్ట్ - ఫిలిప్పీన్స్
గ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత్‌కు 2 అవార్డులుఅమెరికాలో నిర్వహించిన మొదటి గ్లోబల్ రోబోట్ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థుల బృందం రెండు అవార్డులు గెలుచుకుంది. వాషింగ్టన్‌లో జూలై 19న ముగిసిన మూడు రోజుల అంతర్జాతీయ పోటీల్లో 157 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ముంబైకి చెందిన 15 ఏళ్ల రాకేశ్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిన ఝంగ్ హెంగ్ ఇంజనీరింగ్ డిజైన్‌కు బంగారు పతకం, గ్లోబల్ చాలెంజ్ మ్యాచ్ డిజైన్‌కు కాంస్య పతకం దక్కాయి.
ఐఫా అవార్డులు - 201718వ ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ)-2017 అవార్డుల ప్రదానోత్సవం జూలై 16న అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా ‘నీర్జా’ నిలిచింది. పింక్ సినిమాకుగాను అనిరుధ్ రాయ్ చౌదరీకి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది. సంగీత దర్శకుడిగా పాతికేళ్లు పూర్తిచేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు.
అవార్డులు
- ఉత్తమ నటుడు: షాహిద్ కపూర్ (ఉడ్తా పంజాబ్)
- ఉత్తమ నటి: అలియా భట్(ఉడ్తా పంజాబ్)
- ఉత్తమ చిత్రం: నీర్జా
- ఉత్తమ నటుడు(కామిక్): వరుణ్ ధావన్(డిష్యూం)
- ఉత్తమ ప్రతినాయకుడు: జిమ్ సర్బ్(నీర్జా)
- ఉత్తమ నటి(తొలి పరిచయం): దిశా పటానీ(ఎం.ఎస్. ధోని)
- ఉత్తమ నటుడు (తొలి పరిచయం): దిల్జిత్ దొసాంజ్
- ఉత్తమ సహాయనటి: షబానా అజ్మీ(నీర్జా)
- ఉత్తమ సహాయనటుడు: అనుపమ్ ఖేర్(ఎం.ఎస్. ధోని)
- ఉత్తమ దర్శకుడు: అనిరుధ్ రాయ్ చౌదరి(పింక్)
- ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్(యే దిల్‌హై ముష్కిల్)
- ఉత్తమ గేయరచయిత: అమితాబ్ భట్టాచార్య
- ఉత్తమ గాయకుడు: అమిత్ మిశ్రా
- ఉత్తమ గాయని: తులసీ కుమార్
- స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్: అలియా భట్
- ఉమన్ ఆఫ్ ది ఇయర్: తాప్సి
మంగళంపల్లి పేరిట రూ. 10 లక్షల అవార్డుప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరుతో ఏటా ఆయన జయంతి రోజున ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడికి రూ.10 లక్షల నగదు అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బాలమురళీకృష్ణ 87వ జయంతి వేడుకలను జూలై 6న నిర్వహించారు. ఈ సందర్భంగా కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన బాలమురళీకృష్ణ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ బాలమురళీకృష్ణ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో ఆయన పేరిట మ్యూజియం, సంగీత కళాశాల, మెమోరియల్ ట్రస్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాలమురళీకృష్ణ జన్మించిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గుంటూరు సంగీత కళాశాలకు ‘బాలమురళీకృష్ణ సంగీత కళాశాల’గా నామకరణం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు స్పోర్‌ట్స ఇలస్ట్రేటెడ్ ఇండియా మేగజైన్ ఆధ్వర్యంలో మారుతి సుజుకీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రదానోత్సవం జూలై 7న ముంబైలో జరిగింది. ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ‘స్పోర్‌ట్స పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకోగా భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘కోచ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నారు.
అవార్డు గ్రహీతలు
స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ : పీవీ సింధు
కోచ్ ఆఫ్ ది ఇయర్ : పుల్లెల గోపీచంద్
టీమ్ ఆఫ్ ది ఇయర్ : పురుషుల జూనియర్ హాకీ జట్టు
లివింగ్ లెజెండ్ : మిల్కా సింగ్
గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ : లోకేశ్ రాహుల్
లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ : అభినవ్ బింద్రా
టీఎస్‌ఆర్టీసీకి ‘ఇండియా బస్’ పురస్కారాలుఅశోక్ లేలాండ్, అభిబస్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా బస్’ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మూడు పురస్కారాలను సొంతం చేసుకుంది. జూలై 9న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ల చేతుల మీదుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఈడీలు నాగరాజు, వేణులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఎక్సలెన్‌స ఇన్ బస్ ట్రాన్‌సపోర్టేషన్, ఎక్సలెన్‌స ఇన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్, టాప్ బస్ డ్రైవర్ అనే అంశాల్లో ఆర్టీసీ ఈ పురస్కారాలను పొందింది.
ఆచార్య ఇనాక్‌కు రావూరి స్మారక పురస్కారంప్రఖ్యాత కథకుడు, భాషా పరిశోధకుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ 2017 సంవత్సరానికి డాక్టర్ రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రావూరి భరద్వాజ, కాంతమ్మ ట్రస్ట్ నిర్వాహకులు రావూరి కోటేశ్వరరావు, సాయి సుమంత్ జూన్ 28న ఒక ప్రకటన విడుదల చేశారు. జీవీఆర్ ఫౌండేషన్ సహకారంతో జూలై 5వ తేదీన హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో ఈ పురస్కారాన్ని ఇనాక్‌కు ప్రదానం చేస్తారు.
భారతీయ అమెరికన్లకు గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డుఇద్దరు భారతీయ అమెరికన్లకు 2017కిగాను గ్రేట్ ఇమ్మిగ్రంట్స్ అవార్డు వరించింది. అడోబ్ అధిపతి శంతను నారాయణ్, అమెరికా మాజీ సర్జన్ జనరల్ వివేక్ మూర్తిలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దేశం ముందంజ వేయడానికి చేసిన సేవకుగాను ఈ గౌరవం దక్కింది.
బ్రిటన్‌లో జన్మించిన మూర్తిని 2014లో అమెరికా సర్జన్ జనరల్‌గా ఒబామా నియమించారు. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మూర్తిని ఆ పదవి నుంచి తొలగించారు. నారాయణ్ హైదరాబాద్‌లో జన్మించారు. నారాయణ్ యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ మెంబర్‌గా పని చేశారు.
దశరథరామిరెడ్డికి ఔట్ స్టాండింగ్ సిటిజన్ అవార్డు వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ దశరథ రామిరెడ్డికి గ్లోబల్ స్ట్రాటజిక్ అలయన్స్ సంస్థ ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును ప్రకటించింది. జూలై 1న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
వాణిజ్య రంగంలో చేసిన సేవలకు గాను గుంటూరుకు చెందిన జాస్తి రమేశ్‌కు ఔట్ స్టాండింగ్ ఇండియన్ సిటిజన్ అవార్డును అందజేశారు.
ముంబై పేలుళ్ల దోషి ముస్తఫా మృతి1993 నాటి ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన ముస్తఫా దోసా (60) జూన్ 28న ముంబై జైలులో మరణించాడు. దావూద్ ఇబ్రహీంకు దోసా అత్యంత సన్నిహితుడు. పేలుళ్ల కేసులో ముస్తఫాతోపాటు మరో నలుగురిని టాడా ప్రత్యేక కోర్టు ఈ నెల 16నే దోషులుగా తేల్చింది. శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. ముంబైలో మారణహోమం సృష్టించడానికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను దుబాయ్ నుంచి మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా దిఘీకి, పాకిస్తాన్‌కు దోసా సరఫరా చేశాడు.
ఇస్రో మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య మృతిభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ డెరైక్టర్ చుక్కా వెంకటయ్య(75)జూన్ 29న బెంగళూరులో మృతి చెందారు. ఆయన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సోదరుడు. వెంకటయ్య అంతరిక్ష పరిశోధన సంస్థలో డెరైక్టర్‌గా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బృందంలో శాస్త్రవేత్తగా సేవలందించారు.
చుక్కా వెంకటయ్య జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 1937 జూన్ 30న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గూడూరులో జరిగింది. రామయ్య సహకారంతో చదువులో బాగా రాణించారు. హైదరాబాద్‌లో పదో తరగతి చదివారు. వెంకటయ్య ఈ ప్రాంతం నుంచి ఐఐటీలో సీటు సాధించిన మొదటి వ్యక్తి.
ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్ పుస్తకావిష్కరణ‘ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ- ఏ స్టేట్స్‌మన్’ పేరుతో స్టేట్స్‌మన్ గ్రూప్ ప్రచురించిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2న రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. ప్రధానిగా విధులు నిర్వహించడంలో ప్రణబ్ నుంచి సాయం అందుకునే అదృష్టం తనకు దక్కిందన్నారు. గత మూడేళ్లలో తమ మధ్య జరిగిన భేటీల్లో ఆయన తనను కొడుకులా ఆదరించారని పేర్కొన్నారు.
నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్నూతన అటార్నీ జనరల్(15వ)గా 86 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వేణుగోపాల్ నియామకానికి జూన్ 30న ఆమోదం తెలిపారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు ఉంటారు. ఇంతకముందు అటార్నీ జనరల్‌గా ఉన్న ముకుల్ రోహత్గీ జూన్ 18న పదవీ విరమణ చేశారు. రాజ్యాంగ నిపుణుడైన వేణుగోపాల్ గతంలో పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్ జ్యోతి21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అచల్‌కుమార్ జ్యోతిని కేంద్రం నియమించింది. ప్రధాని మోదీ సీఎంగా ఉన్న సమయంలో జ్యోతి గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సీఈసీగా నసీం జైదీ పదవీకాలం జూలై 6తో ముగియడంతో అచల్‌ను నియమిస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 జనవరి 17 వరకు ఆయన సీఈసీగా కొనసాగుతారు. సీఈసీ, ఈసీల పదవీ కాలం ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు. రెండిటిలో ఏది ముందు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
గుజరాత్ సీఎస్‌గా రిటైర్ అయిన జోతి గుజరాత్ విజిలెన్‌స కమిషనర్‌గా, 1999- 2004 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్టు చైర్మన్‌గా, సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఎన్‌ఎన్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేశారు.
పెరూలో అమెరికా రాయబారిగా కృష్ణభారత సంతతికి చెందిన సీనియర్ దౌత్య అధికారి, తెలుగు తెలిసిన వ్యక్తి కృష్ణ ఆర్ ఆర్స్.. పెరూలో అమెరికా కొత్త రాయబారిగా నియమితులయ్యారు. ఆయనకు అమెరికా విదేశాంగ శాఖలో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. 1986 నుంచి దౌత్య అధికారిగా వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు.
ఐటీబీపీ డెరైక్టర్ జనరల్‌గా పచ్‌నందఇండో టిబెటన్ సరిహద్దు భద్రతా దళం (ఐటీబీపీ) డెరైక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి ఆర్.కె.పచ్‌నంద జూన్ 30న బాధ్యతలు చేపట్టారు. ఆయన 1983 బ్యాచ్ పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. పచ్‌నంద 2018 అక్టోబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
జూన్ 2017 అవార్డ్స్
అజిమ్ ప్రేమ్‌జీకి కార్నెగీ పురస్కారం భారత్‌లో పాఠశాల వ్యవస్థ అభివృద్ధి కోసం చూపుతున్న దాతృత్వానికిగాను ప్రముఖ పారిశ్రామకవేత్త, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ ప్రతిష్టాత్మక కార్నెగీ అవార్డుకు ఎంపికయ్యారు. దాతృత్వ విభాగంలో అమెరికాలో అందజేసే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఇది.
అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలకు విద్యనందిస్తున్నారు. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది పిల్లలు ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్నారు. ఈ సేవలకు గానూ.. ప్రేమ్‌జీ కార్నెగీ అవార్డును అందుకోనున్నారు.
నిస్వార్థభావంతో సేవలు చేసేవారిని ప్రోత్సహించేందుకుగాను అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆండ్రూ కార్నెగీ పేరు మీదుగా 2001 నుంచి రెండేళ్లకోసారి ఈ అవార్డులు అందజేస్తున్నారు. 2017 సంవత్సరానికి గానూ 9 మంది ఈ అవార్డుకు ఎంపికకాగా అందులో ప్రేమ్‌జీ ఒకరు.
ధన్‌రాజ్ పిళ్లైకి భారత్ గౌరవ్ పురస్కారం భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ గౌరవ్ పురస్కారానికి ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని.. క్లబ్ వ్యవస్థాపక దినమైన ఆగస్టు 1వ తేదీన ప్రదానం చేయనున్నారు. భారత హాకీ జట్టుకు అందించిన అపారమైన సేవలకు గుర్తింపుగా 2017 సంవత్సరానికిగాను పిళ్లైని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని జూన్ 27న ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కళ్యాణ్ మజుందార్ వెల్లడించారు. క్లబ్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు సయ్యద్ నయీముద్దీన్, శుభాష్ బౌమిక్‌లకు లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నట్లు చెప్పారు.
ఆధునిక భారతీయ హాకీ జట్టులో అతిపెద్ద స్టార్‌గా నిలిచిన పిళ్లై... తన 15 ఏళ్ల క్రీడా జీవితంలో అనేక అంతర్జాతీయ వేదికలపై ఒలిపిక్స్‌తోపాటు ప్రపంచ టోర్నీలు, చాంపియన్ ట్రోఫీలు, ఏషియన్ గేమ్స్‌లలో ఆడారు. మొత్తం 339 మ్యాచ్‌ల్లో 170 గోల్స్ సాధించి, అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు ఐరాస పురస్కారం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతిష్టాత్మక ప్రజా సేవ పురస్కారాన్ని గెలుచుకుంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఆ రాష్ర్టం ప్రవేశపెట్టిన కన్యశ్రీ ప్రకల్ప పథకానికి ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డుకు 62 దేశాల నుంచి 552 ప్రాజెక్టులు పోటీ పడగా కన్యశ్రీ ప్రకల్పకు తొలి స్థానం దక్కింది.
డేవిడ్ గ్రాస్‌మన్‌కు మ్యాన్‌బుకర్ ప్రైజ్బ్రిటన్ అందించే ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను 2017 ఏడాదికి ఇజ్రాయెల్‌కు చెందిన రచయిత డేవిడ్ గ్రాస్‌మన్ గెలుచుకున్నారు. ‘ఎ హార్స్ వాక్స్ ఇన్‌టు ఎ బార్’ అనే నవలకుగాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ప్రైజ్‌మనీ మొత్తం 50 వేల పౌండ్లు (దాదాపు రూ.41.2 లక్షలు) కాగా డేవిడ్ నవలను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసిన జెస్సికా కొహెన్‌కు కూడా ప్రైజ్‌మనీలో సగం ఇవ్వనున్నారు.
మ్యాన్ బుకర్ ప్రైజ్‌ని మ్యాన్ గ్రూప్ పీఎల్‌సీ సంస్థ 1969లో ప్రారంభించింది. బ్రిటన్‌లో పబ్లిష్ అయిన ఆంగ్ల నవలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
భారతీ శర్మకు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారంసామాజిక కార్యకర్త డాక్టర్ భారతీ శర్మకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లీజియన్ ఆఫ్ హానర్(చావలియర్ డి ఆర్డ్రే నేషనల్ డి లా లీజియన్ డి హానర్) లభించింది. బాలల రక్షణ, మహిళా సాధికారతకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ ఈ అవార్డును అందించింది. భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ నివాసంలో జూన్ 15న జరిగిన కార్యక్రమంలో ఆమెకు అవార్డును ప్రదానం చేశారు.

Subscribe to:
Comments (Atom)