దేవేంద్ర జఝరియాకు రాజీవ్ ఖేల్త్న్ర భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియా భారత అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ ఖేల్త్న్ర’ అందుకోనున్నాడు. ఈ అవార్డు చరిత్రలో ఓ పారాలింపియన్ ఎంపికవడం ఇదే తొలిసారి. అవార్డుల కమిటీ ఇతనితో పాటు భారత హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌ను ఖేల్త్న్ర కోసం సిఫార్సు చేసింది. దేవేంద్ర జఝరియా పారాలింపిక్స్ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు(2004, 2016) గెలుపొందాడు. ఈ మేరకు రిటైర్డ్ జస్టిస్ సీకే ఠక్కర్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ జావెలిన్ త్రోయర్ జఝరియాకు ఖేల్త్న్రలో తొలి ప్రాధాన్యమిచ్చింది. మరో 17 మందిని ‘అర్జున’ అవార్డుకు నామినేట్ చేసింది. తెలుగు క్రీడాకారులు సాకేత్ మైనేని, వెన్నం జ్యోతి సురేఖ ఈ జాబితాలో ఉన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్‌లో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్, టెస్టు క్రికెటర్ చతేశ్వర్ పుజారాలు ‘అర్జున’కు నామినేట్ అయ్యారు. త్వరలోనే కేంద్ర క్రీడాశాఖ ఈ జాబితాకు ఆమోదం తెలపగానే జాతీయ క్రీడా దినోత్సవమైన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (ఆగస్టు 29) రోజు అవార్డులను ప్రదానం చేస్తారు.
అర్జున అవార్డు నామినీల జాబితా
ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు భారత్‌లో తొలి హరిత మెట్రో అవార్డుని ఢిల్లీ మెట్రో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ గ్రీన్ మెట్రో సిస్టమ్స్ సమావేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డంగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ అవార్డుని ఢిల్లీ మెట్రోకి ప్రకటించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఫేస్ - 3లో స్టేషన్లు, డిపోలు, సబ్ స్టేషన్‌లను హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది.
ట్రిపుల్ ఐటీ హెచ్‌వోడీకి భారత్ విద్యారత్న అవార్డుబాసరలోని ట్రిపుల్ ఐటీలో రసాయన శాస్త్ర విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రవి వరాల అత్యున్నత భారత్ విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 5న జరిగిన ఓ కార్యక్రమంలో రవి వరాల ఇంటర్‌నేషనల్ బిజినెస్ కౌన్సెల్ ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు. విద్యాబోధన క్షేత్రంలో తనదైన నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు.
గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
ధ్యాన్‌చంద్ పురస్కారానికి సిఫార్సైన హకీమ్ భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు.
దేవ్‌పటేల్‌కు గేమ్ చేంజర్స్ అవార్డుస్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన దేవ్ పటేల్ ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2017 సంవత్సరానికి గాను మరో తొమ్మిది మందితో కలిసి ఆయన ఈ అవార్డు అందుకోనున్నాడు. 2017 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది.
కేవలం ఐదారేళ్ల వ్యవధిలోనే దేవ్ పటేల్ ఓ గొప్ప స్టార్‌గా అవతరించాడని, సినిమాలతోపాటు టీవీ షోలలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, కేవలం కథానాయకుడిగానేకాదు.. భారత ప్రేక్షకులకు, పాశ్చాత్య దేశాల ప్రేక్షకులకు మధ్య వారధిని నిర్మించాడని పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. ఇక సేవా కార్యక్రమాల కోసం దేవ్‌పటేల్ చేస్తున్న ఖర్చు కూడా చాలా ఎక్కువేనని, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటిదాకా 2,50,000 డాలర్లను దేవ్ ఖర్చుచేయడం తమను ఎంతగానో ఆకర్షించిందని జ్యూరీ వ్యాఖ్యానించింది.
భారత వ్యాపారవేత్తకు యూఏఈ పురస్కారంజైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించడంలో ప్రత్యేక చొరవ చూపిన భారత వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన ఇటీవల యూఏఈ ఉపప్రధాని హెచ్‌హెచ్ షేఖ్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ మెడల్‌ను స్వీకరించారు.
అర్జున అవార్డు నామినీల జాబితా
| జ్యోతి సురేఖ (ఆర్చరీ) | చౌరాసియా (గోల్ఫ్) |
| సాకేత్ మైనేని (టెన్నిస్) | పుజారా (క్రికెట్) |
| ఖుష్బీర్ కౌర్ (అథ్లెటిక్స్) | హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్) |
| అరోకిన్ రాజీవ్ (అథ్లెటిక్స్) | ప్రశాంతి సింగ్ (బాస్కెట్‌బాల్) |
| దేవేంద్రో సింగ్ (బాక్సింగ్) | ఓయినమ్ బెంబెం దేవి (ఫుట్‌బాల్) |
| ఎస్వీ సునీల్ (హాకీ) | జస్వీర్‌సింగ్ (కబడ్డీ) |
| ప్రకాశ్ (షూటింగ్) | అమల్‌రాజ్ (టేబుల్ టెన్నిస్) |
| సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్) | వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్) |
| మరియప్పన్ తంగవేలు(పారా అథ్లెటిక్స్) |
ఢిల్లీ మెట్రోకు హరిత మెట్రో అవార్డు భారత్‌లో తొలి హరిత మెట్రో అవార్డుని ఢిల్లీ మెట్రో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ గ్రీన్ మెట్రో సిస్టమ్స్ సమావేశంలో ఇండియన్ గ్రీన్ బిల్డంగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ అవార్డుని ఢిల్లీ మెట్రోకి ప్రకటించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఫేస్ - 3లో స్టేషన్లు, డిపోలు, సబ్ స్టేషన్‌లను హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది.
ట్రిపుల్ ఐటీ హెచ్‌వోడీకి భారత్ విద్యారత్న అవార్డుబాసరలోని ట్రిపుల్ ఐటీలో రసాయన శాస్త్ర విభాగం హెచ్‌వోడీ డాక్టర్ రవి వరాల అత్యున్నత భారత్ విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఆగస్టు 5న జరిగిన ఓ కార్యక్రమంలో రవి వరాల ఇంటర్‌నేషనల్ బిజినెస్ కౌన్సెల్ ఆధ్వర్యంలో అవార్డు అందుకున్నారు. విద్యాబోధన క్షేత్రంలో తనదైన నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు.
గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆగస్టు 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు.
ధ్యాన్‌చంద్ పురస్కారానికి సిఫార్సైన హకీమ్ భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు.
దేవ్‌పటేల్‌కు గేమ్ చేంజర్స్ అవార్డుస్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించిన దేవ్ పటేల్ ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ గేమ్ చేంజర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2017 సంవత్సరానికి గాను మరో తొమ్మిది మందితో కలిసి ఆయన ఈ అవార్డు అందుకోనున్నాడు. 2017 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అవార్డుల ప్రదానోత్సవం జరగుతుంది.
కేవలం ఐదారేళ్ల వ్యవధిలోనే దేవ్ పటేల్ ఓ గొప్ప స్టార్‌గా అవతరించాడని, సినిమాలతోపాటు టీవీ షోలలో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడని, కేవలం కథానాయకుడిగానేకాదు.. భారత ప్రేక్షకులకు, పాశ్చాత్య దేశాల ప్రేక్షకులకు మధ్య వారధిని నిర్మించాడని పురస్కార గ్రహీతల ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది. ఇక సేవా కార్యక్రమాల కోసం దేవ్‌పటేల్ చేస్తున్న ఖర్చు కూడా చాలా ఎక్కువేనని, అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఇప్పటిదాకా 2,50,000 డాలర్లను దేవ్ ఖర్చుచేయడం తమను ఎంతగానో ఆకర్షించిందని జ్యూరీ వ్యాఖ్యానించింది.
భారత వ్యాపారవేత్తకు యూఏఈ పురస్కారంజైళ్లలో మగ్గుతున్న ఖైదీలను విడిపించడంలో ప్రత్యేక చొరవ చూపిన భారత వ్యాపారవేత్త ఫిరోజ్ మర్చెంట్‌కు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన ఇటీవల యూఏఈ ఉపప్రధాని హెచ్‌హెచ్ షేఖ్ నుంచి కమ్యూనిటీ సర్వీస్ మెడల్‌ను స్వీకరించారు.
No comments:
Post a Comment